ఆజం ఖాన్ అసభ్య వ్యాఖ్యలు , ఈసీ నిషేధం

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 10:59 AM

 ఆజం ఖాన్  అసభ్య వ్యాఖ్యలు ,  ఈసీ నిషేధం

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాంపూర్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి జయప్రద మీద అదే స్థానం నుండి సమాజ్ వాడీ పార్టీ అభ్యర్హ్దిగా పోటీ చేస్తున్న ఆజం ఖాన్ ఖాకీ అండర్ వేర్ అంటూ అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో ఆయన మీద ఈసీ నిషేధం విధించింది. రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న జయప్రదపై ఆజంఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఖాకీ అండర్‌వేర్ వేసుకుందని 17 రోజుల కిందటే తెలిసిందంటూ నీచంగా మాట్లాడారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఖండించింది. బీజేపీ నేతల ఫిర్యాదుతో ఆజంఖాన్‌‌పై ఐపీసీ 509 ప్రకారం కేసు నమోదైంది. ఇక మరోపక్క నాకు ఓటేయకపోతే మీకు ఉద్యోగాలు ఇవ్వమని ముస్లింలను ఉద్దేశించి ఉత్తర ప్రదేశ్ లోనే కేంద్ర మంత్రి మేనకా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిఫలం ఆశించకుండా ఇస్తూ పోతుండటానికి మేమేమీ మహాత్మాగాంధీ పిల్లలం కాదన్నారు. ఆమె సుల్తాన్‌పూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలపై ఎన్నికల సంఘం నిషేధం వేటేసిన సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements