ప్లేఆఫ్స్ లో RCBకి నో ఎంట్రీ....ముంభైకి మరో విజయం

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 12:17 PM

ప్లేఆఫ్స్ లో RCBకి నో ఎంట్రీ....ముంభైకి మరో విజయం

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి ముంభైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో బెంగుళూరు జట్టుకి ప్లేఆఫ్ లో చోటు లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంభై ఫీల్డింగ్ ఎంచుకోగా తోలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన బెంగుళూరు జట్టు ఓపెనర్ విరాట్ కోహ్లి (8: 9 బంతుల్లో 1x4) తొలి ఓవర్‌లోనే ఫోర్ కొట్టి మంచి టచ్‌లో కనిపించినా.. మూడో ఓవర్‌లో బెరండ్రాఫ్‌ బౌలింగ్‌లో ఔటైపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ (28: 20 బంతుల్లో 4x4, 1x6) తొందరపడి జట్టు స్కోరు 49 వద్ద పెవిలియన్‌కి చేరిపోయాడు. ఈ దశలో మొయిన్ అలీతో కలిసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన ఏబీ డివిలియర్స్.. మూడో వికెట్‌కి అభేద్యంగా 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకోగా.. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మలింగ విడదీశాడు. ఆ తర్వాత ఆఖరి ఓవర్‌లో దూకుడు పెంచిన డివిలియర్స్ కూడా ఏమరపాటులో రనౌటైపోయాడు. అనంతరం వచ్చిన స్టాయినిస్ (0), అక్షదీప్ (2), పవన్‌నేగి (0) తేలిపోవడంతో.. బెంగళూరు 171 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లక్ష్య చేధనలో ముంభై ఓపెనర్లు డికాక్, రోహిత్ శర్మ (28: 19 బంతుల్లో 2x4, 2x6) 7 ఓవర్లలోనే 70 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్నిచ్చారు. అయితే.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన మొయిన్ అలీ రెండు బంతుల వ్యవధిలోనే ఈ ఓపెనింగ్ జోడీని పెవిలియన్‌కి పంపగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (29: 23 బంతుల్లో 2x4, 1x6), ఇషాన్ కిషన్ (21: 9 బంతుల్లో 3x6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకున్నారు. దీంతో.. ఆఖర్లో ఒత్తిడికి గురైన కృనాల్ పాండ్య‌ (11: 21 బంతుల్లో 1x4) బంతుల్ని వేస్ట్ చేయడంతో.. మళ్లీ బెంగళూరు మ్యాచ్‌లోకి వచ్చినట్లు కనిపించింది. కానీ.. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అదీ 4 బంతుల వ్యవధిలోనే 20 పరుగులు రాబట్టిన హార్దిక్ పాండ్య.. అలవోకగా ముంబయిని గెలిపించేశాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్, మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఐదో విజయాన్ని అందుకున్న ముంబయి మూడో స్థానానికి ఎగబాకింది. తాజా సీజన్‌లో ముంబయి చేతిలో బెంగళూరు టీమ్ ఓడటం ఇది రెండోసారి. మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన ముంబయి ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.





Untitled Document
Advertisements