తమిళనాడులో పట్టుపడ్డ రూ.12కోట్లు...ఎన్నికలు రద్దు!!!

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 12:41 PM

తమిళనాడులో పట్టుపడ్డ రూ.12కోట్లు...ఎన్నికలు రద్దు!!!

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం ముగిసి ఇంకో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి అనే క్రమంలో అక్కడ సంచులకొద్ది దొరికిన డబ్బు కలకలం రేపుతోంది. దీంతో అక్కడ ఎన్నికలు రద్దు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. పూర్తి వివరాల ప్రకారం...తమిళనాడులోని వెల్లోర్ నియోజకవర్గంలోని డీఎంకే అభ్యర్థికి చెందిన సిమెంట్ గోడౌన్‌లో ఉన్న రూ.12 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ లోక్ సభ ఎన్నికలను రద్దు చేయాలని ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని రాష్ట్రపతికి కూడా చేరవేసింది. కాగా రాష్ట్రపతి నిర్వణయ మీదే వెల్లోర్ లో ఎన్నికలు జరుగుతాయో లేదో తెలుస్తోంది. కాగా రెండో విడతలో భాగంగా ఈ నెల 18వ తేదీన వెల్లోర్‌లో పోలీంగ్ జరగాల్సి ఉంది.





Untitled Document
Advertisements