నలుగురిపై ఈసీ వేటు

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 04:22 PM

నలుగురిపై ఈసీ వేటు

లక్నో: ఎన్నికల కమిషన్ ప్రధాన పార్టీల అధికారులకు షాక్ ఇస్తుంది. ఈ మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిఎస్‌పి అధినేత్రి మాయావతి వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో మతపరమైన విమర్శలు చేస్తున్నారని వీరిపై ఎన్నికల సంఘం తాత్కాలిక నిషేధం విధించింది. వీరిరువురు ప్రచారంలో భాగంగా మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటలు, మాయావతిపై 48 గంటల తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిషేధం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు ఇటీవల తన నియోజకవర్గం సుల్తాన్‌పూర్‌లో మేనకాగాంధీ ముస్లిం మైనారిటీల సదస్సులో మాట్లాడుతూ తమకు ఓటు వేయకపోతే ఉపాధి అవకాశాల కోసం వచ్చిన వారిని పట్టించుకోనని వ్యాఖ్యలు చేసినందుకు కూడా ఇసి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మేనక ప్రచారాన్ని 48గంటల పాటు నిషేధం విధిస్తూ సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటన చేసింది. అదే విధంగా ఎస్‌పి నేత ఆజంఖాన్‌ను మూడు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించింది.





Untitled Document
Advertisements