పసిడి ఎగసింది

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 05:43 PM

పసిడి ఎగసింది

నాలుగు రోజుల నుండి క్షీణిస్తూ వస్తున్న బంగారం ధర మంగళవారం కాస్త పైకి పెరిగింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.32,790కు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో రూ.38,350కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.32,790కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.32,620కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.కేజీ వెండి రూ.250 పెరుగుదలతో రూ.38,350కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ రూ.334 పెరుగుదలతో రూ.37,322కు ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది. హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,830కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,310కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.40,300కు చేరింది.





Untitled Document
Advertisements