కనిమొళి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు

     Written by : smtv Desk | Wed, Apr 17, 2019, 09:46 AM

కనిమొళి ఇంట్లో  ఐటీ అధికారులు సోదాలు

తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సోదరి, డీఎంకే అభ్యర్థి కనిమొళి ఇంట్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తూత్తుకుడిలోని ఆమె నివాసం.. పార్టీ కార్యాలయంలో 10 మంది ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కనిమొళి భారీగా నగదు వినియోగిస్తున్నారని తెలుసుకున్న అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతుంది.

అయితే ఐటీ రైడ్స్ విషయం తెలుసుకున్న డీఎంకే శ్రేణులు అక్కడికి చేరుకోగా.. పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా తమిళనాడులోని వేలూరు లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న గంట వ్యవధిలోనే ఐటీ అధికారులు కనిమొళి నివాసంలో సోదాలు చేపట్టడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది.





Untitled Document
Advertisements