వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన

     Written by : smtv Desk | Wed, Apr 17, 2019, 04:55 PM

వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన

మే 30 న ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకీ తాజాగా ఇంగ్లాండ్ సెలక్టర్లు 15 మందితో కూడిన జట్టుని ప్రకటించారు. గత కొంతకాలంగా టీమ్‌ని వన్డేల్లో సమర్థంగా నడిపిస్తున్న ఇయాన్ మోర్గాన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సెలక్టర్లు.. వికెట్ కీపర్‌గా జోస్ బట్లర్‌‌ని ఎంపిక చేశారు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి ఆడుతున్న బట్లర్.. అసాధారణ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి ఆడుతున్న ఓపెనర్ జానీ బెయిర్‌స్టో‌కి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. అతను ఐపీఎల్‌లో ఇప్పటికే శతకం సాధించి మంచి జోరుమీదున్నాడు. క్రికెట్‌ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ను గెలవలేదు. ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం.. టోర్నీలో చతికిలపడటం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. గత రెండేళ్లుగా ఆ జట్టు వన్డేల్లో అసాధారణంగా ఆడుతోంది. ఎంతలా అంటే.. ఈ మధ్యకాలంలో ఆ జట్టు మూడు సార్లు వన్డేల్లో 400పైచిలుకు స్కోరు చేసింది. క్రికెట్ ప్రపంచంలో ఈ తరహాలో ఏ జట్టు కూడా వన్దేల్లో ఆధిపత్యం చెలాయించలేదు. దీనికి తోడు స్వదేశంలో ప్రపంచకప్ జరగనుండటంతో.. ఆ జట్టు ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఇంగ్లాండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), టామ్ కరన్, జో డెన్లీ, అలెక్స్ హేల్స్, ఫ్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్‌స్టోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్‌వోక్స్, మార్క్‌వుడ్.





Untitled Document
Advertisements