శ్రీరెడ్డికి గుడ్ న్యూస్....స్పెషల్ గా జీవోను రిలీజ్ చేసిన టీఎస్ సర్కార్

     Written by : smtv Desk | Wed, Apr 17, 2019, 08:06 PM

శ్రీరెడ్డికి గుడ్ న్యూస్....స్పెషల్ గా జీవోను రిలీజ్ చేసిన టీఎస్ సర్కార్

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. గతంలో వివిధ మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. దీని కోసం ఒక జీవోను కూడా విడుదుల చేసింది. 984 నంబరుతో వచ్చిన ఈ జీవో కింద.. సుప్రియ, యాంకర్ ఝాన్సీ, డైరెక్టర్ నందిని రెడ్డిలను కమిటీలో టాలీవుడ్‌ ప్రతినిధులుగా ప్రభుత్వం నియమించింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కాలేజీ వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మిలతో ఈ కమిటీనీ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాతదర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా ఇందులో సభ్యులు. పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల్లోని మహిళలు తమ ససమ్యలను ఈ కమిటీకి చెప్పుకోవచ్చు. దోషులను కఠినంగా శిక్షించేర అధికారం ఈ కమిటీకి ఉంటుంది. అవకాశాలు ఇస్తామంటూ పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు అమ్మాయిలను లైంగికంగా దోచుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనికి నిరసనగా ఆమె ‘మా’ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు.





Untitled Document
Advertisements