కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ ప్రొడ్యూసర్

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 03:31 PM

కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ ప్రొడ్యూసర్

కమెడియన్ గా కెరియర్ మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాత గా మారిన నటుడు బండ్ల గణేష్. అతి తక్కువ సినిమాలతోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత సినిమాలు నిర్మించడం మానేసి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు.. ఇక ఇప్పుడు మరోసారి వెండి తెరపై కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

అనిల్ రావిపూడి – మహేష్ బాబు కాంబినేషన్లో ఓ మూవీ మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బండ్ల గణేష్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. త్వరలోనే దీనికి సంబదించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఎఫ్ 2 తో సంచలన విజయం అందుకున్న అనిల్..ఇప్పుడు ఇండస్ట్రీ లోనే టాప్ డైరెక్టర్ గా స్థానం సంపాదించాడు. ఈయన తో సినిమాలు చేసేందుకు అగ్ర హీరోలు , నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇక మహేష్ మూవీ ని దిల్ రాజు – అనిల్ సుంకర లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.





Untitled Document
Advertisements