కెనడాలో తెలుగు వారి ఆధిపత్యం

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 04:07 PM

కెనడాలో తెలుగు వారి ఆధిపత్యం

కెనడ: కెనడాలో ఇద్దరు తెలుగు వారు అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద్ పాండా, విజయనగరానికి చెందినా లీల అహీర్‌లు ఈ ఎన్నికల్లో యునైటెడ్ కన్సర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఈ గెలుపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ నెల 16న అల్బెర్టా ఎన్నికలు జరగగా, ఈరోజు వాటి ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 87 స్థానాలున్న అసెంబ్లీకి గాను యుసీపీ 64 సీట్లలో గెలుపొంది అధికారం చేపట్టబోతోంది.

Untitled Document
Advertisements