వాట్సాప్ న్యూ అప్ డేట్....ఫింగర్ ప్రింట్ ఉంటేనే...!

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 05:55 PM

వాట్సాప్ న్యూ అప్ డేట్....ఫింగర్ ప్రింట్ ఉంటేనే...!

ప్రముఖ సోషల్ మీడియా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఫోన్ డేటా సురక్షితంగా ఉండడానికి వాట్సాప్‌ను తెరిచేందుకు ఫింగర్ ప్రింట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, మెసెజీలను స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా ఈ బయోమెట్రిక్ తప్పనిసరి. అయితే స్క్రీన్‌షాట్స్‌ ఆప్షన్‌ మాత్రం తప్పనిసరి కాదు. స్క్రీన్‌షాట్స్‌ తీసుకోవాలో, వద్దో మనం ఎంచుకోవచ్చు. తీసుకోవాలంటే ఆప్షన్‌ను యాక్టివేట్ చేసి ఫింగర్ ప్రింట్ వేయాల్సిందే. ఈ ఫీచర్లతోపాటు డూడుల్‌ యూఐని కూడా వాట్సాప్‌ తీసుకొస్తోంది. దీని ద్వారా స్టికర్లను, ఎమోజీలను షేర్ చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements