హైదరాబాద్‌లో రూ.82 కోట్ల విలువైన 146 కేజీల బంగారు ఆభరణాలు సీజ్

     Written by : smtv Desk | Thu, Apr 18, 2019, 06:58 PM

హైదరాబాద్‌లో రూ.82 కోట్ల విలువైన 146 కేజీల బంగారు ఆభరణాలు సీజ్

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఒక జువెలర్, అతని సంబంధీకుల నుంచి ఏకంగా రూ.82 కోట్ల విలువైన 146 కేజీల బంగారు ఆభరణాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. తాజాగా ఈడీ హైదరాబాద్, విజయవాడలోని ముసద్దిలాల్ జువెలర్స్‌ షోరూమ్‌లు.. వీటి ప్రమోటర్ అయిన కైలాస్ గుప్తా ఇంట్లో.. అలాగే బాలాజీ గోల్డ్ ప్రమోటర్ పవన్ అగర్వాల్ ఇంట్లో.. ఇంకొక కంపెనీ అష్ట లక్ష్మీ గోల్డ్ ప్రమోటర్ నీల్ సుందర్ థారాడ్ ఇంట్లో.. చార్టెడ్ అకౌంటెంట్ సంజయ్ సర్దా ఇంట్లో గత కొన్ని రోజులుగా సోదాలు చేసింది. వీరి వద్ద నుంచి మొత్తంగా రూ.82.11 కోట్ల విలువైన 145.89 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకొని అలాగే వీరందరిపై మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి క్రిమినల్ కేసు కూడా పెట్టింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు ప్రకారం చూస్తే.. వీరందరూ డీమోనిటైజేషన్ స్కీమ్‌ను దుర్వినియోగం చేశారు. వీళ్లందరూ భారీ స్థాయిలో లెక్కల్లో చూపని నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకున్నారు. దీని కోసం దాదాపు 5,200 దొంగ రశీదులను సృష్టించారు. వీటి విలువ కూడా రూ.2 లక్షలలోపు ఉండేలా చూసుకున్నారు. దీంతో పాన్ కార్డు వివరాలు ఇవ్వకుండా తప్పించుకున్నారు. కాగా ప్రధాని మోదీ 2016 నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements