కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్... ప్రియాంక చతుర్వేది రాజీనామా

     Written by : smtv Desk | Fri, Apr 19, 2019, 03:52 PM

కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్... ప్రియాంక  చతుర్వేది రాజీనామా

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది గురువారం రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ.. నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు.. చిల్లర బ్యాచ్‌కు ప్రోత్సాహం ఇస్తోందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఆమె పాల్గొన్న ఓ కార్యక్రమంలో కొందరు కాంగ్రెస్ నేతలు దురుసుగా మాట్లాడారు. ఈ సంఘటనపై ఆమె పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడంతో వారిపై సస్పెన్షన్ విధించారు. అయితే, తాజాగా జ్యోతిరాదిత్య సింథియా వారిపై సస్పెన్సన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక చతుర్వేది సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండు పేజీల రాజీనామా లేఖను రాశారు.





Untitled Document
Advertisements