అసెంబ్లీ ఎన్నికల రేస్ లో రజినీకాంత్

     Written by : smtv Desk | Fri, Apr 19, 2019, 07:33 PM

అసెంబ్లీ ఎన్నికల రేస్ లో రజినీకాంత్

కోలీవుడ్ సూపర్‌స్టార్.. తమిళనాట సరికొత్త రాజకీయ పార్టీ అధినేత రజనీకాంత్ ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఈరోజు రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మెజారిటీ సాధించడంలో విఫలమై 23 మే తర్వాత రద్దైతే.. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము పోటీలో ఉంటామని వివరించారు.

అదేవిధంగా కొత్త పార్టీ ఏర్పాటుపై ఎలాంటి ప్లాన్ చేస్తున్నారని ప్రశ్నించగా... మే 23 తర్వాత నిర్ణయిస్తామని.. అభిమానులను మాత్రం కచ్చితంగా నిరాశ పరచనని రజినీ తెలిపారు. తమిళనాడులో ఈమధ్య పలు రాజకీయ పార్టీల నేతలు.. ఇతరులపై ఈసీ, ఐడీ దాడుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడటంపై స్పందిస్తూ... ఈసీ పనితీరు బాగుందంటూ వెల్లడించారు.

అంతేకాకుండా మోడీ మళ్లీ పీఎం అవుతారా అని ప్రశ్నించగా.. రజనీకాంత్ ఏమన్నారంటే... మే 23న తెలుస్తుందని క్లుప్తంగా తెలిపారు. కాగా.. రజినీకాంత్ 2017 డిసెంబర్‌లో రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు పోటీ చేస్తామని అన్నారు.
అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2021లో జరగాల్సి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో మే 23న వెలువడే ఫలితాలను బట్టి.. అన్నాడీఎంకే ప్రభుత్వం సుస్థిరత ఎంతమాత్రం అనేది ఆధారపడి ఉంది. దాన్ని బట్టి రజనీకాంత్ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయని ఆయన మాటల్లో వ్యక్తమైంది.





Untitled Document
Advertisements