మొట్టమొదటిసారి ఆరు యూనివర్సిటీలకు కామన్ పీజీ ఎంట్రెన్స్‌

     Written by : smtv Desk | Mon, Apr 29, 2019, 06:18 PM

మొట్టమొదటిసారి ఆరు యూనివర్సిటీలకు కామన్ పీజీ ఎంట్రెన్స్‌

హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీలకు దేశంలోనే తొలిసారిగా కామన్ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్య మండలి చైర్మన్ పాపి రెడ్డి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ‌ఆధ్వర్యంలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఉన్న 80 కోర్సుల అడ్మిషన్లు కోసం పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జేఎన్టీయూలోని ఎమ్మెస్సీ అడ్మిషన్లకు కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. అటు ఈ పరీక్షల కోసం 25 ఆన్ లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఓయూ వీసీ రామచంద్రం తెలిపారు. మే‌ 30 వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం ఉందన్న ఆయన.. జాన్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.





Untitled Document
Advertisements