వయసొచ్చిన ప్రతీ యువకుడు.. ముగ్గురిని పెళ్లి చేసుకోవాల్సిందే.

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 11:30 AM

వయసొచ్చిన ప్రతీ యువకుడు.. ముగ్గురిని పెళ్లి చేసుకోవాల్సిందే.

స్వాజిలాండ్: ఆఫ్రికాలోని స్వాజిలాండ్ కు చెందిన రాజు మెస్వాతి-3 విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. అదేంటంటే ఆ దేశంలో పెళ్లిడుకొచ్చిన ప్రతీ పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని, అదికూడా 2019 జూన్ నెల పూర్తి అయ్యేలోపు చేసుకొవాలని ఆదేశాలు జారీ చేశారు.ఈలోగా పెళ్లి చేసుకోకుంటే పురుషులు లేదా స్త్రీలకు యావజ్జీవ శిక్ష విధిస్తామని రాజు హెచ్చరించారు.అయితే 5గురు మహిళలను పెళ్లి చేసుకున్న వారికి పెళ్లి ఖర్చులతో పాటు ఆ భార్యలకు ఇళ్లను కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. రాజు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేమిటంటే.. ఆఫ్రికా దేశమైన స్వాజిలాండ్ లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారట. అందుకే ఈ దేశాన్ని కన్యల రాజ్యంగా పిలుస్తారు. స్త్రీ-పురుష జనాభా మధ్య సమతూకం కోసం ఒక్కొక్కరు కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవాలని రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అన్నట్లు ఇంత కఠినమైన ఆదేశాలు జారీచేసిన మెస్వాతి-3కి 15 మంది భార్యలు, 25 మంది సంతానం ఉన్నారు.

మెస్వాతి-3 తండ్రి ఈయన కంటే ఘనుడే. ఆయనకు 70 మంది భార్యలు, 150 మందికిపైగా సంతానం ఉంది. కాగా, ఇలాంటి చర్యల వల్ల దేశం మరింత పేదరికంలోకి జారిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా స్వాజిలాండ్ రాజు మెస్వాతి-3 మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు.





Untitled Document
Advertisements