అదరకొడుతున్న వన్ ప్లస్ 7 సిరీస్ ఫోన్లు

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 02:23 PM

అదరకొడుతున్న వన్ ప్లస్ 7 సిరీస్ ఫోన్లు

చైనా స్మార్ట్ ఫోన్‌ తయారీదారు వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, మీకు అందుబాటు అయిన ధరలోనే అంటూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. వన్‌ ప్లస్‌ సిరీస్‌ లో వన్‌ప్లస్‌ 7, మరియు వన్‌ప్లస్‌ 7ప్రో డివైస్‌ లను మంగళవారం ఆవిష్కరించింది. 7ప్రో లో బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం బెంగళూరు, లండన్‌, న్యూయార్క్‌ లో ఒకేసారి ఆవిష్కరణ ఈవెంట్లు నిర్వహించింది. ఈ నెల 17 నుంచి అమెజాన్‌ లో అమ్మకాలు ప్రారంభంకానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకైతే.. 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే అదుబాటులోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.2 వేల ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ రియర్‌(మెయిన్‌ కెమెరా 48 ఎంపీ) కెమెరా, 16 ఎంపీ పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరా ఫీచర్లను కంపెనీ హైలెట్‌ గా చేస్తోంది.

వన్‌ప్లస్‌ 7ప్రో ఫీచర్లు

6.67 అంగుళాల ఆల్‌ స్క్రీన్‌ ఫ్లూయిడ్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే
90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌
6 జీబీ/8 జీబీ/12 జీబీ ర్యామ్‌.. 128 జీబీ/256 జీబీ స్టోరేజ్‌
48+16+8 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు..

12 జీబీ, 256జీబీ స్టోరేజ్‌: రూ.57,999

8 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌: రూ.52,999

6 జీబీ,128 జీబీ స్టోరేజ్‌: రూ.48,999

వన్‌ ప్లస్‌ 7 ఫీచర్లు

6.41 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
వాటర్‌ డ్రాప్‌ నాచ్‌.. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌
క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రోసెసర్‌
6, 8 జీబీ ర్యామ్‌… 128, 256 జీబీ స్టోరేజ్‌
48 +5 ఎంపీ రియర్‌ డబుల్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు..

8 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌: రూ.37,999

6జీబీ,128 జీబీ స్టోరేజ్‌: రూ.32,999





Untitled Document
Advertisements