నిరుద్యోగులకు మరొక శుభవార్త

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 03:10 PM

నిరుద్యోగులకు మరొక శుభవార్త

నిరుద్యోగులకు మరొక శుభవార్త .. దేశంలోని వివిధ నావికాదళాల పరిధిలోని యూనిట్లలో నాన్ గెజిటెడ్, నాన్ ఇండస్ట్రీయల్ గ్రూప్-బీ చార్జ్ మెన్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ దరఖాస్తులు కోరుతోంది. ఇందులో 103 మెకానిక్ పోస్టులు, 69 ఎక్స్ ప్లోజివ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 30 ఏళ్లు మించి వయసు ఉండకూడదు.

విద్యా అర్హత :
సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం:
అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:
SC, ST అభ్యర్ధులు, మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. మిగిలినవారు రూ.205 చెల్లించాలి.

దరఖాస్తు ప్రారంభం: మే 13, 2019

దరఖాస్తు చివరి తేదీ: మే 26, 2019

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

-పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, పీజీ (సైన్స్/ఆర్ట్స్), ఐటీఐ చేసినవారు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫీసర్లు (పీసీ & ఎస్‌ఎస్‌సీ)
-ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, ఎడ్యుకేషన్ బ్రాంచీల్లో 121 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పది, ఇంటర్, బీఈ, ఎంసీఏ.

Untitled Document
Advertisements