డయాబెటిస్ కి మంచి మందు

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 03:18 PM

డయాబెటిస్ కి మంచి మందు

జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్లు మన శరీరాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తాయి. కొన్ని మంచి ఫలితాలు కనిపించినప్పటికీ వాటితోపాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. రోజూ మనం అనేక రోగాల భారిన పడుతుంటాం. చిన్న వయస్సులోనే ప్రమాదకరమైన రోగాలు సంభవించే అవకాశం ఉంది.

ముఖ్యంగా డయాబెటిస్(మధుమేహం) మరిన్ని వ్యాధులకు కారణమవుతుంది. ప్రాథమిక దశలో ఈ వ్యాధిని గుర్తించినట్లయితే, నియంత్రణలో ఉంచవచ్చు. కాకరకాయ చక్కెర వ్యాధికి మంచి మందు. కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

రోజుకి ఒకసారి కాకరకాయ జ్యూస్ తాగితే మంచిది. ఈ రసంలో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజలవణాలు, పీచు పదార్థం ఉండడం వలన బరువు తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

కాకరకాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీని వలన రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. వాపులను నిరోధిస్తుంది. కాకరకాయ రసాన్ని ఉదయం పరగడుపున తాగాలి. గ్యాస్ సమస్యతో బాధపడేవారు మధ్యాహ్నం భోజనం తర్వాత దీనిని త్రాగాలి.

ఈ జ్యూస్‌లో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలుపుకుని తాగితే మరీ మంచిది. గ్లాసు కాకరకాయ జ్యూస్‌లో 11 రకాల క్యాలరీలు, 0.1 గ్రా కొవ్వు, 0.7 గ్రా ప్రొటీన్, 1.7 గ్రాములు పీచుపదార్థం ఉంటుంది.





Untitled Document
Advertisements