కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే..

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 03:50 PM

కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే..

టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' రూపొందింది. అందాల భామ రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు. "కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే .. ఒడి చేరి ఒకటైపోయే .. తీరం కోరే ప్రాయం .. " అంటూ ఈ రొమాంటిక్ సాంగ్ సాగుతోంది.ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేమికులందరిని ఆకట్టుకుంటుంది .
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ - ఐశ్వర్య రవిచంద్రన్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన బాణీ అద్భుతంగా వుంది. ప్రేమగీతాల్లో ఉండవలసిన ఫీల్ ను ఆయన చాలా అందంగా ఆవిష్కరించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ గీతాల్లో ఈ పాట చేరిపోతుందని చెప్పొచ్చు. అనుభవాలు .. జ్ఞాపకాలు .. ఆలోచనలు కలబోసిన అందమైన విజువల్స్ తో ఈ సెకండ్ సింగిల్ మనసుకు పట్టేస్తోంది.

Untitled Document
Advertisements