ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదు.. అందుకే నన్ను టార్గెట్ చేసారు

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 04:40 PM

ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదు.. అందుకే నన్ను టార్గెట్ చేసారు

తెలంగాణ ప్రభుత్వంపై టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పలు ఆరోపణలు చేశారు. పోలీసుల నోటీసులకు స్పందించకుండా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలను ఆయన వెల్లడించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ టీవీ 9లో ఓ కథనాన్ని ప్రసారం చేశానని ఆయన తెలిపారు. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని... అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని చెప్పారు.

తనను టార్గెట్ చేయడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ, వ్యాపార అజెండా ఉందని రవిప్రకాశ్ తెలిపారు. వాస్తవానికి ఆ లైవ్ షోను ప్రసారం చేసే సమయంలో కూడా తాను ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదని, కేవలం వ్యవస్థ వైఫల్యం గురించే ప్రశ్నించానని చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే తామంతా ప్రశ్నించకుండా... చూసీచూడనట్టు వ్యవహరించాలా? అని రవిప్రకాశ్ మండిపడ్డారు.

Untitled Document
Advertisements