క్యాష్‌‌బాక్ రూపంలో దాదాపు పది కోట్ల మోసం

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 04:41 PM

క్యాష్‌‌బాక్ రూపంలో  దాదాపు పది కోట్ల మోసం

ముంబై : క్యాష్‌‌బాక్ రూపంలో దాదాపు పది కోట్ల రూపాయల మోసం గుర్తించడంతో చాలా మంది ఉద్యోగులను తొలగించడంతోపాటు, చిన్న మర్చంట్లను కూడా డీలిస్ట్‌‌ చేసినట్లు పేటీఎం ప్రకటించింది. క్యాష్‌‌బాక్‌‌ మోడల్ కరెక్టైనదేనని ఈ సందర్భంగా సీఈఓ విజయ్‌‌ శేఖర్‌‌ శర్మ వెల్లడించారు. దివాలి తర్వాత చాలా మంది చిన్న వ్యాపారస్తులు భారీ క్యాష్‌‌బాక్స్‌‌ అందుకోవడాన్ని తమ టీం గమనించిందని, దాంతో లోతుగా పరిశీలించాల్సిందిగా ఆడిటర్లను కోరడంతో ఈ ఫ్రాడ్‌‌ బయటకు వచ్చిందని శర్మ తెలిపారు.

ఈ మోసాన్ని విచారించేందుకు కన్సల్టెన్సీ సంస్థ ఈవై సేవలను కూడా పేటీఎం ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. కిందిస్థాయిలోని కొంత మంది ఉద్యోగులతో కుమ్మక్కై కొంత మంది సెల్లర్లు అక్రమంగా క్యాష్‌‌బాక్‌‌లు పొందినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ మోసం రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చని శర్మ తెలిపారు. మోసానికి పాల్పడిన ఉద్యోగులు, వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కొంత మంది ఉద్యోగులు వ్యాపారులతో కలిసిపోయి ఫేక్‌‌ ఆర్డర్లు సృష్టించడం ద్వారా క్యాష్‌‌బాక్‌‌లు పొందినట్లు తేల్చారు.

Untitled Document
Advertisements