డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులుకు క్లీన్ చిట్ పై క్లారిటీ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 04:43 PM

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులుకు క్లీన్ చిట్ పై క్లారిటీ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు

రెండేళ్ల క్రితం టాలీవుడ్ ప్రముఖులపై నమోదు చేసిన డ్రగ్స్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో సినీ ప్రముఖులు సహా ఏ ఒక్కరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 7 ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, ఇంకా 5 ఛార్జిషీట్లు త్వరలో దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చాయని అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టమని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.

Untitled Document
Advertisements