మరోసారి నాగ చైతన్య తో రొమాన్స్ కు రెడీ అంటున్న హాట్ భామ

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 05:37 PM

మరోసారి నాగ చైతన్య తో రొమాన్స్ కు రెడీ అంటున్న హాట్ భామ

మజిలీ సినిమా హిట్ తో అక్కినేని నాగ చైతన్య కెరియర్ మళ్లీ జోష్ అందుకుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి డైరక్షన్ లో ఓ సినిమా ఉంటుందని వార్తలు రాగా ఆ సినిమా చైతు నుండి రవితేజ దగ్గరకు వెళ్లిందని తెలుస్తుంది. నాగ చైతన్య నూతన దర్శకుడు డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్న ఈ సినిమాలో చైతు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుందని తెలుస్తుంది.

చైతుతో కాజల్ దడ సినిమాలో నటించింది.. ఆ సినిమా నాగ చైతన్య కెరియర్ లోనే డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయితే మరోసారి ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ తెలియాల్సి ఉంది. ఈమధ్య కాజల్ కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అమ్మడు నటించిన సీత సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.

Untitled Document
Advertisements