రిలయన్స్‌ జియో యూజర్లకు గుడ్ న్యూస్

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 05:41 PM

రిలయన్స్‌ జియో యూజర్లకు గుడ్ న్యూస్

టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు మరొక అద్భుత ఆఫర్‌ ప్రకటించింది. కాంప్లిమెంటరీ బేసిస్‌గా ప్రస్తుత ఎగ్సిస్టింగ్ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తద్వారా రిలయన్స్ జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఆటోమేటిగ్గా రెన్యూవల్ అవుతుందన్నమాట.

జియో ప్రైమ్ సభ్యత్వం ఖరీదు ఏడాదికి రూ.99. అయితే కంపెనీ ఇప్పుడు ఈ మెంబర్‌షిప్‌ను ఉచితంగానే ఆటో రెన్యూవల్ చేసింది. మైజియో యాప్‌లోకి వెళ్లి ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ఆటో రెన్యూవల్ అయిందో లేదో చెక్‌ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లోని మై ప్లాన్స్ సెక్షన్‌లో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ చూసుకోవచ్చు. పొడిగిస్తే ఆ మేరకు సందేశం వస్తుంది. తమ యూజర్ల కోసం ఇప్పుడు జియో ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా మరో ఏడాది వరకు ఫ్రీగా ఆటో రెన్యూవల్ అయ్యే అవకాశాన్ని కల్పించింది.

Untitled Document
Advertisements