విమానంలో భారతీయుడు మృతి...ఎమర్జెన్సీ ల్యాండింగ్

     Written by : smtv Desk | Wed, May 15, 2019, 05:46 PM

విమానంలో భారతీయుడు మృతి...ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఢిల్లీ నుంచి మిలాన్ కు బయల్దేరిన విమానం యూఏఈలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక భారతీయ వ్యక్తి మృతి చెందడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని ఇండియన్ ఎంబసీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసారు . ఇక వివరాల్లోకి వెళితే మృతుడు రాజస్థాన్ కు చెందిన కైలాశ్ చంద్ర శైనీ (52) అని ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది. తన 26 ఏళ్ల కుమారుడు హీరా లాల్ తో కలసి ప్రయాణిస్తుండగా ఈ విషాదకర ఘటన సంభవించిందని తెలిపింది.

ఈ సందర్భంగా ఎంబసీ కౌన్సిలర్ ఎం.రాజమురుగన్ మాట్లాడుతూ, అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సోమవారం రాత్రి ఈ ఘటన సంభవించిందని తెలిపారు. మృతదేహాన్ని మఫ్రాక్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. పోస్ట్ మార్టం వంటి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, ఇతిహాద్‌ విమానంలో బాడీని బుధవారం భారత్‌కు పంపిస్తామని వెల్లడించారు. ఇదొక దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు.

Untitled Document
Advertisements