జానీ బైర్‌స్టో విధ్వంసం .. 44.5 ఓవర్లలోనే 359 స్కోరు

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 10:04 AM

జానీ బైర్‌స్టో  విధ్వంసం   .. 44.5 ఓవర్లలోనే 359 స్కోరు

పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ ఇమాముల్ హక్ (151) రికార్డు శతకంతో పాక్‌ను ఆదుకున్నాడు. హారిస్ సోహైల్ (41), ఆసిఫ్ అలీ (52) కూడా తమవంతు సహకారం అందించడంతో పాక్ క్లిష్టమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. అయితే ఓపెనర్ జానీ బైర్‌స్టో విధ్వంసక శతకంతో చెలరేగడంతో ఇంగ్లండ్ ఈ భారీ లక్ష్యాన్ని సయితం అలవోకగా ఛేదించింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ బైర్‌స్టో 90 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో 15 ఫోర్లతో 128 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జాసన్ రాయ్ కూడా ధాటిగా ఆడాడు. 55 బంతుల్లోనే 4 సిక్స్‌లు, మరో 8 ఫోర్లతో రాయ్ 76 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మోయిన్ అలీ 3సిక్స్‌లు, మరో 4 ఫోర్లతో అజేయంగా 46 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ 44.5 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌లో ఇంగ్లండ్ 20 ఆధిక్యాన్ని అందుకుంది.





Untitled Document
Advertisements