రైతులకు అండగా విశాల్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 11:04 AM

రైతులకు  అండగా విశాల్

తమిళ స్టార్ హీరో, నడిగర్ సంగం అధ్యక్షుడు విశాల్ సమాజ సేవ చేయడంలో ముందుంటాడని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే పలు సహాయ కార్యక్రమాలు చేపట్టి సేవా దృక్పథాన్ని చాటుకున్న ఆయన తాజాగా ఇంకో అడుగు ముందుకు వేశారు.

తన తాజా చిత్రం ‘అయోగ్య’కు అమ్ముడయ్యే ప్రతి టికెట్ డబ్బులోను ఒక రూపాయి వాటా తమిళనాడు రైతులకు ఇవ్వనున్నాడు విశాల్. గతంలో కూడా ‘అభిమన్యుడు’ సినిమా విడుదల సమయంలో ఇదే పని చేశాడు. విశాల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన అభిమానులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాని అయోగ్య పేరుతొ విశాల్ తమిళంలో రీమేక్ చేశాడు. ఇందులో విశాల్ సరసన రాశీ ఖన్నా నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది.

Untitled Document
Advertisements