యోగ బెస్ట్ అంటున్న యూనివర్సల్ బాస్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 11:43 AM

యోగ బెస్ట్ అంటున్న యూనివర్సల్ బాస్

ఐదోసారి వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగుతున్న విండీస్‌ వీరుడు క్రిస్‌ గేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌… ఫిట్‌ నెస్‌ ను కాపాడుకోవడానికి యోగాను ఆశ్రయించాడు. గత రెండు నెలల నుంచి ఈ యూనివర్సల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాస్‌ … జిమ్‌ లను వదిలేసి యోగా మంత్రాన్ని పటిస్తున్నాడు. ఫీల్డ్‌ లో ఎక్కువ సమయం గడిపేందుకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్సివ్‌ యోగా, మసాజ్‌ సెషన్ల వైపు మొగ్గు చూపుతున్నాడు. సాధారణంగా భారీ కాయుడుడైన 39 ఏళ్ల గేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. జిమ్‌ అవసరం లేకుండానే మ్యాచ్‌ లకు మధ్య ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ యోగాతో బాడీని కాపాడుకుంటున్నాడు. ఈ ఫిట్‌ నెస్‌ మంత్ర బాగా పని చేస్తుందనడానికి.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోఅతను 40.83 సగటుతో 490 పరుగులు చేయడమే నిదర్శనం. ‘వరల్డ్‌ కప్‌ లో రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. మెగా ఈవెంట్‌ లో ఆడిన అనుభవం నాకు చాలా ఉంది. ప్రస్తుతం నా బ్యాటింగ్‌ పై చాలా సంతృప్తిగా ఉన్నా. ఇదే ఫామ్‌ ను వరల్డ్‌ కప్‌ లోనూ కొనసాగిస్తా ’ అని గేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. వయసుకు తగినట్లుగా శరీరాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమన్నాడు. అయితే మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా అనుకూలంగా మార్చుకోవచ్చని చెప్పా డు.

Untitled Document
Advertisements