వినాయక్ హీరో .. శ్రియ హీరోయిన్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 12:03 PM

వినాయక్ హీరో .. శ్రియ హీరోయిన్

తెలుగులో మాస్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచుకున్నటువంటి వ్యక్తి వి.వి.వినాయక్… ఒక మాస్ దర్శకుడిగా తన సత్తా ఏంటో చెప్పడానికి తన సినిమాలు చుస్తే తెలుస్తుందనేది తెలుగు సినీ వర్గాలు చెబుతాయి… కాగా వినాయక్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనుంది. అది కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు… అయితే ఒక మధ్య వయసుకు చెందినటువంటి ఒక వ్యక్తికీ సంబందించిన ఒక కథ దిల్ రాజు వద్దకు రాగ, దాంట్లో కథానాయకుడి పాత్ర పోషించడానికి వినాయక్ ఐతే సరిగ్గా సరిపోతాడని, సంప్రదింపులు జరపగా అందుకు తానూ కూడా సమ్మతమా తెలిపినట్లు సమాచారం.

అయితే కొంత కాలం నుండి సరైన విజయాలు లేక సతమవుతున్నటువంటి వినాయక్ కి హీరో గా ఈ సినిమా అయినా విజయం ఇస్తుందా అనేది సినీ వర్గాల్లో చర్చగా మిగిలిపోయింది. అయితే ఈ చిత్రానికి వినాయక్ బాడీ లాంగ్వేజ్ అయితే సరిగ్గా సరిపోతుందని అందుకోసమనే దిల్ రాజు పట్టు బట్టి మరీ వినాయక్ ని ప్పించాడని సమాచారం. కాగా ఈ చిత్రంలో వినాయక్ కి జోడిగా నటించేందుకు ఒక స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తానెవరో కాదు వినాయక్ దర్శకత్వంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రేయ… ఈ చిత్రంలో నటించేందుకు శ్రేయ కూడా ఒప్పుకుందని, త్వరలోనే ఈ చిత్రం మొదలవబోతుందని సమాచారం.

Untitled Document
Advertisements