తెలంగాణ ఇచ్చింది .. మీ నాలుగు కుటుంబాలకు కాదు

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 12:07 PM

తెలంగాణ ఇచ్చింది .. మీ నాలుగు కుటుంబాలకు కాదు

పీసీసీ మాజీ అద్యక్ష్యుడు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పైన కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు… తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్ అధికారాన్ని చేపట్టినప్పటినుండి కూడా తన కుటుంబానికి మాత్రమే మేలు జరిగిందని, అది మినహా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. సోనియా గాంధీ గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కేవలం మీ నాలుగు కుటుంబాలకు కాదని, రాష్ట్ర ప్రజల బాగుకోసమేనని లక్ష్మయ్య అన్నారు. అయితే మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి చేపట్టిన ఆమరణదీక్ష మంగళవారం రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… సిగ్గులేకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని తానే సాధించానని సీఎం కేసీఆర్‌ చెప్పుకుంటున్నాడని, ఇన్ని ఎలుగు జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహించకుండా ఉంటున్నాడని అన్నారు.

ఇప్పటికైనా కెసిఆర్ ప్రగతిభవన్‌ విడిచి గ్రామాల్లో తిరిగి ప్రజాసమస్యలు తెలుసుకొని, ప్రజలకు హామీ ఇచ్చిన పనులు సకాలంలో పూర్తీ చేయాలనీ లక్ష్మయ్య అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందనీ, త్వరలోనే కెసిఆర్ కుట్రపూరిత రాజకీయాలు అన్ని కూడా బయటకు వస్తాయని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని తెలిపారు. కాగా తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టామని, అయితే అప్పుడున్న ధరలకే పరిహారం ఇచ్చామని తెలిపారు. ఇప్పటికైనా కెసిఆర్ తన ధోరణిని మార్చుకొని ప్రజల పక్షాన ఉండి ప్రజా శ్రేయస్సు పనులని నిర్వహించాలని కోరారు.

Untitled Document
Advertisements