రైల్లో పోర్న్ ఆడియో... ఆ అరుపులతో షాకైన వందల మంది ప్రయాణికులు.

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 12:14 PM

రైల్లో పోర్న్ ఆడియో... ఆ అరుపులతో షాకైన వందల మంది ప్రయాణికులు.

రైలు డ్రైవర్ తన మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. ఆ వీడియో ప్లే కాగానే దానికి సంబంధించిన ఆడియో.. రైలులోని సౌండ్ సిస్టంకి కనెక్ట్ అయ్యింది. దాంతో రైల్లోని అన్ని బోగీల్లోనూ శృంగార సంభాషణలు, అరుపులూ ప్రయాణికులకు వినిపించాయి. అవి విన్న ప్రయాణికులంతా షాకయ్యారు. ఈ ఘటన సౌత్ లండన్ ట్రైన్‌లో జరిగింది.

ఆ అరుపులు విన్న రైలులోని ప్రయణికుల్లో కొందరు వారిలో వారే.. నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన చిన్న క్లిప్పును రికార్డు చేసిన ఓ ప్రయాణికుడు.. ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి ఏకంగా 17 లక్షల వ్యూస్, 14,500 రీట్వీట్స్, 56వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

Untitled Document
Advertisements