వాళ్ళకి థాంక్స్ చెప్పిన కింగ్ నాగార్జున

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 12:17 PM

వాళ్ళకి థాంక్స్ చెప్పిన కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం మన్మథుడు 2. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు సీక్వెల్ గా వస్తున్న సినిమా మన్మధుడు 2. మన్మధుడు సినిమాలో భారీ విజయం సాదించడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మనం ఎంటర్ టైన్ మెంట్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చర్స్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగార్జున కొడుకు నాగచైతన్య, కోడలు సమంత కూడా చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లోని అందమైన లొకేషన్స్ లో జరుగుతున్నది. పోర్చుగల్ లో సినిమా కోసం పనిచేసిన అక్కడి టిమ్ తో కలిసి నాగార్జున ఫోటో దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో మన్మధుడు డైరీస్ పేరుతో పోస్ట్ చేశారు. పోర్చుగీస్ లో షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, మన్మధుడు 2 కు పనిచేసిన పోర్చుగీస్ టీంకు నాగార్జున థాంక్స్ చెప్తూ ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Untitled Document
Advertisements