ప్రముఖ నటుడు కమల్ హసన్ మీద చెప్పు దాడి ?

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 12:43 PM

ప్రముఖ నటుడు కమల్ హసన్ మీద చెప్పు దాడి ?

తమిళనాడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న హీరో, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ను చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ర్యాలీలో కమల్ మాట్లాడుతున్న క్రమంలో ఆయన మీదకి కొందరు ఆయనపైకి చెప్పులు విసిరారు. అయితే ఆవి ఆయనకు తగల్లేదు, త్రుటిలో అయన తప్పించుకున్నాడు. రెండ్రోజుల క్రితం ఆయన హిందూ ఉగ్రవాదం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో దీనికీ దానికీ ఖచ్చితంగా సంబంధం ఉందని పోలీసులు అంచనాకి వచ్చారు. వారి అంచనాకు తగ్గట్టే కమల్‌ అభిమానులు, కార్యకర్తలు 11 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిలో భాజపా నేతలు, హనుమాన్‌ సేన సభ్యులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తొలి ఉగ్రవాది హిందువు అనీ కమల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యల నేపధ్యంలో కమల్‌ హసన్ మీద కేసు కూడా నమోదైంది.

Untitled Document
Advertisements