కాజల్ అయితే చేయం అన్నారు: దర్శకుడు తేజ

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 12:57 PM

కాజల్ అయితే చేయం అన్నారు: దర్శకుడు తేజ

పన్నెండేళ్ల క్రితం తేజ రూపొందించిన `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ అయిపోయిన కాజల్ మూడోసారి తేజ దర్శకత్వంలో సినిమా చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా తేజ `సీత` సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా గురించి తాజాగా తేజ మాట్లాడుతూ....ఈ సినిమా కథ కాజల్ కు ఎప్పుడో తెలుసు. అప్పటి నుంచి నన్ను వెంటాడుతోంది. ఈ సినిమా కథను వేరే హీరోయిన్ కు చెప్పనివ్వలేదు. దాంతో ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ఫిక్స్ అయింది. తర్వాత హీరోలకు కథ చెప్పడం మొదలు పెట్టాను. అయితే హీరోయిన్ గా కాజల్ పేరు చెప్పగానే వారెవరూ అంగీకరించలేదు. ఫైనల్ గా బెల్లంకొండ ఒప్పుకున్నాడు. ఈ సినిమా కథ అంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే కాజల్ ఈ సినిమాను వదులుకోలేదని తేజ చెప్పాడు.

Untitled Document
Advertisements