రకుల్‌ సీన్‌‌పై సెన్సార్ బోర్డు కత్తెర

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 12:59 PM

రకుల్‌ సీన్‌‌పై సెన్సార్ బోర్డు కత్తెర

సెన్సార్ బోర్డు ఏ సినిమాపై కత్తెర పెట్టినా అది చర్చనీయాంశంగా మారిపోతుంటుంది. ఈ సారి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) కత్తెర బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సినిమా‘దే దే ప్యార్ దె’పై పడింది. బోర్డు ఈ సినిమాలోని సీన్, కొన్ని డైలాగులపై అభ్యంతరం తెలిపింది. అలాగే సినిమాలో చేయాల్సిన మార్పుల గురించి కూడా తెలియజెప్పింది. వివరాల్లోకి వెళితే ఈ సినిమాలోని ఒక పాటలో హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ విస్కీ బాటిల్ చేతిలో పట్టుకుని డాన్స్ చేస్తూ కనిపిస్తుంది.

ఈ సినిమాకు బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేముందు ఈ సీన్ డిలీట్ చేయాలని ఆదేశించింది. అలాగే రకుల్ చేతిలోవున్న విస్కీ బాటిల్ స్థానంలో పూలగుత్తి ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చింది. అలాగే సినిమాలోని రెండు డైలాగులపై కూడా కత్తెర వేసింది. కాగా ఈ సినిమాలో అజయ్ దేవగన్, రకుల్‌తో పాటు టబూ, అలోక్‌నాథ్ జిమీ షెర్గిల్ తదితరులు నటిస్తున్నారు. అకీవ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 17న విడుదల కానుంది.

Untitled Document
Advertisements