సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో మార్పులు...

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:04 PM

సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో మార్పులు...

పదో తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులపై సీబీఎస్‌ఈ కసరత్తు చేస్తోంది. ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్‌ టైప్ ప్రశ్నలను గణనీయంగా తగ్గించి, వివరణాత్మక సమాధానాలను కోరేలా ప్రశ్నలను పెంచాలన్నది సీబీఎస్ఈ కొత్త ఆలోచన. ఈ తరహా ప్రశ్నలను పెంచడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచవచ్చని, రాతలో నైపుణ్యాన్ని మెరుగు పరచవచ్చని, ఇదే సమయంలో బట్టీ పట్టి జవాబులు రాసే విధానానికి స్వస్తి పలకవచ్చని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఒక్కో ప్రశ్నకు ఇస్తున్న మార్కులను కూడా పెంచాలని, దీని ద్వారా విద్యార్థులను ప్రోత్సహించవచ్చని ఆలోచిస్తున్నారు. సమాధానాలు ఎంత వివరంగా ఉంటే, అన్ని ఎక్కువ మార్కులను ఇవ్వడం ద్వారా వారిలోని సృజనాత్మకతను బయటకు తీసేలా ప్రశ్నపత్రాలను మార్చాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న ఈ మార్పులు ఖరారైన తరువాత నమూనా పేపర్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు అంటున్నారు. అయితే, తాము ప్రశ్నపత్రాన్ని సమూలంగా మార్చాలని భావించడం లేదని, ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.

Untitled Document
Advertisements