ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుగైన అవకాశాలు : వెస్ట్ ఇండీస్ దిగ్గజం

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:14 PM

 ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుగైన అవకాశాలు : వెస్ట్ ఇండీస్ దిగ్గజం

ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు మెరుగైన అవకాశాలున్నాయని వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం మైఖేల్ హోల్డింగ్ జోస్యం చెప్పారు. ఇంగ్లండ్ పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయని, గతంలో కూడా ఇక్కడ ప్రపంచకప్ గెలిచిన ఘనత టీమిండియాకు ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఎదురులేని శక్తిగా మారిందన్నారు. ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా భారత్‌కు ఉందని, ఈసారి విశ్వవిజేతగా నిలిచే అన్ని వనరులు టీమిండియాకు ఉన్నాయని హోల్డింగ్ అన్నారు.

ఇక, ఈ వరల్డ్‌కప్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి, స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా భారత్‌కు చాలా కీలకమన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరిద్దరూ విజృంభిస్తే ప్రత్యర్థి జట్లకు ఇబ్బందులు తప్పక పోవచ్చన్నారు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మల రూపంలో భారత్‌కు అనుభవజ్ఞలైన క్రికెటర్లు అందుబాటులో ఉన్నారన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉందన్నారు. కాగా, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును కూడా తక్కువ అంచన వేయలేమని హోల్డింగ్ అన్నారు. కొంతకాలంగా ప్రపంచ క్రికెట్‌లో ఇంగ్లండ్ నిలకడైన విజయాలు సాధిస్తుందన్నారు. ఆ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారన్నారు. దీంతో భారత్, ఇంగ్లండ్ ఏదో ఒక జట్టు ప్రపంచకప్ గెలుస్తుందనే నమ్మకం తనకుదన్నారు.





Untitled Document
Advertisements