గ్యాంగ్ రేప్ బాధితురాలికి రాహుల్ గాంధీ పరామర్శ

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:25 PM

గ్యాంగ్ రేప్ బాధితురాలికి రాహుల్ గాంధీ పరామర్శ

రాజస్థాన్ లోని ఆల్వార్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి ఇంటికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. రాజకీయాలు చేయడానికి తాను ఇక్కడకు రాలేదని... బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వచ్చానని అన్నారు. బాధితురాలి కుటుంబీకులతో కొన్ని వ్యక్తిగత విషయాలపై మాట్లాడానని... వాటిని బయటకు వెల్లడించలేనని చెప్పారు.

ఏప్రిల్ 26 న అల్వాల్ లో సామూహిక అత్యాచారం జరిగింది. దళిత సామాజికవర్గానికి చెందిన బాధితురాలు తన భర్తతో కలసి బైక్ పై వెళ్తుండగా... బైక్ లపై వచ్చిన దుండగులు వారిని అడ్డుకుని, పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. భర్తను చితకబాది, అతని కళ్ల ముందే బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు.

Untitled Document
Advertisements