ఇంటర్‌ నెట్ లో వైరల్‌ గా మారిన వాట్సన్ పిక్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:33 PM

ఇంటర్‌ నెట్ లో వైరల్‌  గా మారిన వాట్సన్ పిక్

గత ఆదివారం ఐపీఎల్‌ ఫైనల్‌ ఉత్కంఠంగా ముగిసింది. ఫైనల్‌ మ్యాచ్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలవకపోయినప్పటికీ.. అందరి నోళ్లల్లో వినిపించే పేరు మాత్రం ఆ టీమ్‌ ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ది. ఫైనల్‌ లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మోకాలికి గాయం అయి రక్తం కారుతున్నా.. ఏ మాత్రం చలించకుండా.. తన బ్యాటింగ్‌ ను కొనసాగించాడు. ఈ విషయం మ్యాచ్‌ ముగిసిన తర్వాతి రోజు చెన్నై స్పిన్నర్‌ హార్భజన్‌ సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో వాట్సన్‌ గాయం గురించి చెప్పడంతో విషయం తెలిసింది. దీంతో సోషల్‌మీడియా వేదికగా వాట్సన్‌ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిసింది. దీంతో క్రికెటర్లకు కొంత సమయం దొరకడంతో వాట్సన్‌ తన కుటుంబంతో కలిసి.. ఆటోలో చెన్నై మొత్తం తిరుగుతున్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం ఇంటర్‌ నెట్ లో వైరల్‌ గా మారింది. వాట్సన్‌ ప్రయాణించేందుకు కార్లు ఉన్నా.. హుందాగా ఆటోలో నిరాడంబరంగా ప్రయాణిస్తున్నాడు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు మరోసారి వాట్సన్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Untitled Document
Advertisements