జేఈఈలో కేకేఆర్‌ విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్‌

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:42 PM

జేఈఈలో కేకేఆర్‌ విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్‌

జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-2(బీ.ఆర్క్‌ జీ.ప్లానింగ్‌)లో తమ విద్యార్థి గొల్లపూడి లక్ష్మీనారాయణ జాతీయ స్థాయి ఓపెన్‌ కేటగిరిలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడని డాక్టర్‌ కేకేఆర్‌ గౌతం ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేకేఆర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అతను డాక్టర్‌ కేకేఆర్‌ హ్యాపీ వ్యాలీ స్కూల్‌లో సీబీఎ్‌సఈ +1, +2లతోపాటు ఐఐటీ ఫౌండేషన్‌ కోచింగ్‌ తీసుకున్నాడని పేర్కొన్నారు. తమ సంస్థ పూర్వ విద్యార్థులు ఆల్‌ ఇండియా లెవల్‌లో 1, 7, 7, 10 ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీలలో వందలోపు మొత్తం 27 ర్యాంకులు సాధించారని వివరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, అధ్యాపకులను చైర్మన్‌తోపాటు, డైరెక్టర్లు కె.అవినాష్‌, శ్రీతేజ అభినందించారు.





Untitled Document
Advertisements