సింగర్ శ్రేయా ఘోషల్ కు విమానంలో చేదు అనుభవం

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:45 PM

సింగర్ శ్రేయా ఘోషల్ కు విమానంలో చేదు అనుభవం

ప్రముఖ సినీ గాయని శ్రేయా ఘోషల్ కు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆమె సింగపూర్ కు బయల్దేరింది. ఆ సమయంలో తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే, పరికారాన్ని విమానంలోకి తీసుకురాకూడదని ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆమెకు చెప్పారు. తప్పని పరిస్థితుల్లో విమానాశ్రయంలోనే దాని ఆమె వదిలేసింది.

ఆ తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ పై ట్విట్టర్ ద్వారా ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. విలువైన వాయిద్య పరికరాలు ఉంటే సింగపూర్ ఎయిలైన్స్ విమానంలోకి ఎక్కనివ్వదేమో అంటూ ఎద్దేవా చేసింది. తనకు గుణపాఠం నేర్పినందుకు ధన్యవాదాలు అంటూ విమర్శించింది. ఆమె ట్వీట్ కు సింగపూర్ ఎయిర్ లైన్స్ స్పందించింది. ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని... తమ సిబ్బంది మీతో ఏమన్నారో వివరంగా చెప్పాలని కోరింది.

Untitled Document
Advertisements