సైరా: ప్రత్యేక పాత్ర‌లో అనుష్క....భారీ రెమ్యున‌రేష‌న్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:48 PM

సైరా:  ప్రత్యేక పాత్ర‌లో అనుష్క....భారీ రెమ్యున‌రేష‌న్

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా రూపొంద‌నున్న `సైరా` సినిమాలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, కిచ్చ సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి వంటి ప్ర‌ముఖ న‌టులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఇది 19వ శ‌తాబ్దానికి చెందిన కథ కావ‌డంతో నేరుగా క‌థ‌లోకి వెళ్ల‌కుండా, `బాహుబలి`తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన అనుష్క చేత `సైరా` క‌థ చెప్పించ‌బోతున్నార‌ట‌. 'సైరా' లో న‌టించ‌డం గురించి చాలా రోజులు ఆలోచించిన స్వీటి ఎట్ట‌కేల‌కు ఓకే చెప్పింద‌ట‌. ఈ ప్రత్యేక పాత్ర‌లో న‌టించినందుకుగానూ అనుష్క భారీ రెమ్యున‌రేష‌న్ అందుకోబోతోందోట‌. దేశ‌వ్యాప్తంగా ప‌రిచ‌యం ఉన్న హీరోయిన్ కాబ‌ట్టి, అమె వ‌ల్ల సినిమాకు ఇత‌ర భాష‌ల్లోనూ డిమాండ్ పెరుగుతుందనే కార‌ణంతో అనుష్క అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు నిర్మాత చెర్రీ అంగీక‌రించాడ‌ట‌.

Untitled Document
Advertisements