పొగాగుకు భారీ మూల్యం చెల్లించిన వ్యక్తి ..

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 01:50 PM

పొగాగుకు  భారీ మూల్యం చెల్లించిన వ్యక్తి  ..

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. బహిరంగ దూమపానం చేస్తే జరిమానా తప్పదని మనందరికి తెలుసు.కానీ మన దగ్గర ఎంత చెప్పినా నిబంధనలు అమల్లోకి వచ్చిన దాఖలలు లేవు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మాత్రం బహిరంగ దూమపానం చేస్తున్నవారిపై, నిర్లక్ష్యంగా సిగరేట్‌ ముక్కలు పడేస్తున్నవారిపై కొరడా ఝళిపిస్తోంది. తాజాగా కెంట్‌ యాష్‌ఫోర్డ్‌ అంతర్జాతీయ రైల్వే స్టేషన్‌ ఆవరణలో సిగరెట్‌ తాగిన జాన్‌ విల్సన్‌ అనే వ్యక్తికి ఏకంగా రూ. 1.25 లక్షలు జరిమానా విధించింది కోర్టు. మొదటగా రూ. 7వేల ఫైన్‌ వేస్తే అది కట్టకపోవడంతో దానిని లక్షా 25వేలకు పెంచింది ధర్మాసనం. ఈ భారీ జరిమానా చెల్లించేందుకు విల్సన్‌ కు 18 నెలల గడువిచ్చింది.

Untitled Document
Advertisements