నేను గర్భవతిని....నన్ను వదిలేయండి ప్లీజ్!!

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 02:03 PM

నేను గర్భవతిని....నన్ను వదిలేయండి ప్లీజ్!!

అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో ఓ పోలీస్ అధికారి గర్భవతిని కాల్చి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. పమెల టర్నర్(44) అనే మహిళను అరెస్ట్ చేసే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పమెలపై అంతకుముందు ఉన్న నేర ఆరోపణల నేపథ్యంలో ఆమెపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలో స్టీవ్ డొర్రిస్ అనే బేటౌన్ పోలీస్ అధికారికి ఆమె కనబడడంతో అరెస్ట్ చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఆమె తన వద్ద ఉన్న తుపాకీ తీసి డొర్రిస్‌కు గురిపెట్టింది.

దాంతో అతడు నీవు చేస్తుంది తప్పు తుపాకీ కింద పడేయాలని చెప్పాడు. అనంతరం తన వద్ద ఉన్న గన్‌తో ఆమెకు గురిపెట్టాడు. ఆ సమయంలో టర్నర్ తాను గర్భవతినని నన్ను వదిలేయండి అంటూ అరిచింది. కానీ స్టీవ్ ఆమెపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దాంతో టర్నర్ అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి అంతర్జాలంలో పెట్టడంతో వైరల్ అయింది. నెటిజన్లు పోలీస్ అధికారిని నిండు గర్భిణీని కాల్చి చంపుతావా? అంటూ నిలదీస్తున్నారు. అయితే, పోలీసుల విచారణలో మాత్రం టర్నర్ అసలు గర్భవతియే కాదని తేలింది.

Untitled Document
Advertisements