ప్రైవసీ కావాలన్న కొడుకు.....సీసీ కెమెరాను అమర్చిన తల్లిదండ్రులు

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 02:06 PM

ప్రైవసీ  కావాలన్న కొడుకు.....సీసీ కెమెరాను అమర్చిన తల్లిదండ్రులు

అమెరికా లాంటి దేశాల్లో చిన్న వయసు నుంచే యువతీయువకులు ప్రైవసీ కోరుకుంటుంటారు. అలాస్కాకు చెందిన ఓ 15 ఏళ్ల యువకుడు కూడా తనకు తల్లిదండ్రుల నుంచి ప్రైవసీ కావాలంటూ రెడిట్ అనే సోషల్ న్యూస్ వెబ్‌సైట్‌ లీగల్ యాక్షన్‌ను సంప్రదించాడు.

తన గదిలో హస్తప్రయోగం చేసుకునే సమయంలో తండ్రి అకస్మాత్తుగా గదిలోకి ప్రవేశించాడని.. తాను చేస్తున్న పనికి తనపై కోపగించుకున్నాడని యువకుడు వాదిస్తున్నాడు. పెళ్లి అవకుండా అలాంటి పనులు చేయడం తప్పని తన తల్లిదండ్రులు చెబుతున్నారని రెడిట్ వెబ్‌సైట్‌లో చెప్పాడు.

జీవితం గురించి ఆలోచించే వయసు తనకు ఎప్పుడో వచ్చిందని, తనకు నచ్చినట్టు జీవించే సౌకర్యం లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హస్తప్రయోగం చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులు సీసీ కెమెరాను కొన్నారని, తన గదిలో, బాత్‌రూంలో కెమెరాను అమర్చి తనను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తామంటూ హింసిస్తున్నారని ఆరోపించాడు. యువకుడు పెట్టిన పోస్ట్‌కు చాలా మందే స్పందించారు.

ప్రతి ఒక్కరికీ ప్రైవసీ అనేది అవసరమని.. అయితే ఈ విషయంపై యువకుడు తన వయసున్న వారితో చర్చించి తాను చేస్తోంది తప్పో కాదో తెలుసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు బలవంతంగా ఆపాలని చూస్తే భవిష్యత్తులో యువకుడికి అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని మరి కొంతమంది తెలిపారు.

Untitled Document
Advertisements