ముస్లింలతో కలిసి వైఎస్‌ జగన్ ప్రత్యేక ప్రార్థనలు

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 02:09 PM

ముస్లింలతో కలిసి వైఎస్‌ జగన్ ప్రత్యేక ప్రార్థనలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన సొంత జిల్లాలో బిజీబిజీగా గడుపుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో నిన్న ఉదయం భాకరాపురంలోని తన క్యాంపు ఆఫీస్ లో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజాదర్బార్ తర్వాత స్థానిక వీజే ఫంక్షన్ హాలులో వైఎస్సార్‌సీపీ నాయకుడు రసూల్‌ సాహేబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి వైఎస్‌ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్‌కు ఇమామ్‌ జామిన్‌ను చేతికి కట్టారు. అనంతరం, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులు వైఎస్ జగన్ కు ఖర్జూరాలు తినిపించారు. ఇకపోతే ఈరోజు కూడా కడప జిల్లాలోనే వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రేపు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు వైఎస్ జగన్.

Untitled Document
Advertisements