మూడేళ్లుగా అత్యాచారం...ప్రాణం తీసిన పోలీసుల నిర్లక్ష్యం

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 02:54 PM

మూడేళ్లుగా అత్యాచారం...ప్రాణం తీసిన పోలీసుల నిర్లక్ష్యం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. గ్యాంగ్‌రేప్‌కు గురైన వివాహిత తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా కూడ స్పందించలేదు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

యూపీలోని హపూర్‌లో ఓ మహిళకు బాల్యంలోనే వివాహమైంది. 14 ఏళ్లకే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కొంత కాలానికే ఆమెకు బిడ్డ పుట్టింది. ఆ తర్వాత భర్తతో విబేధాల కారణంగా ఆమె విడాకులు తీసుకొంది. బిడ్డతో కలిసి వేరుగా నివాసం ఉంటుంది.

ఈ తరుణంలో ఆమెను కుటుంబ సభ్యులు రూ. 10 వేలకు ఓ వ్యక్తికి విక్రయించారు. వివాహితను కొనుగోలు చేసిన వ్యక్తి తనకు అప్పు ఇచ్చిన వారి ఇంట్లో పనికి ఆమెను పంపేవారు. అంతేకాదు కొందరు ఆమెపై అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న ఆ మహిళపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంతేకాదు బాధితురాలిపై వేధింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు.

బాధితురాలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృత్యువాత పడింది. బాధితురాలి మరణించిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదు.

ఢిల్లీ మహిళా కమిషన్‌ ఈ విషయం గురించి యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు లేఖ రాయడంతో పాటు నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడంతో పోలీసుల్లో చలనం మొదలైంది. మహిళ చనిపోయిన 14 రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కానీ ఇంతవరకూ ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్‌ చేయలేదు. ఈ ఘటనలో 16 మందిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements