మహి భాయ్ అంటే నాకు గౌరవం .. రూమర్స్ కి చెక్ పెట్టిన కుల్దీప్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 02:56 PM

 మహి భాయ్ అంటే నాకు గౌరవం .. రూమర్స్ కి చెక్ పెట్టిన కుల్దీప్

ఎటువంటి కారణం లేకుండానే మీడియా తనను వివాదంలోకి లాగిందని, ధోనీకి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తపడిచాడు . ధోనీ సలహాలు చాలా సార్లు పని చేయలేదంటూ కుల్దీప్ కామెంట్ చేశాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు కుల్దీప్ . తాను ఎవరిమీదా అనవసరపు వ్యాఖ్యలు చేయలేదని మహి భాయ్ అంటే తనకు ఎంతో గౌరవముందని తెలిపాడు. ఆట మధ్యలో ధోనీ మాట్లాడడని, అవసరం అనుకుంటేనే ఓవర్స్ గ్యాప్‌లో మాట్లాడతాడని కుల్దీప్ పేర్కొన్నారు

Untitled Document
Advertisements