ఫేస్‌బుక్ లైవ్ నిబంధనలు ఇక కఠినతరం!

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 03:05 PM

ఫేస్‌బుక్ లైవ్ నిబంధనలు ఇక కఠినతరం!

పారిస్: న్యూజిలాండ్‌లో మసీదుల్లో జరిగిన నరమేధాన్ని హంతకుడు ఫేస్‌బుక్‌లోప్రత్యక్ష ప్రసారం చేసిన నేపథ్యంలో ఫేస్‌బుక్ కఠిన నిర్ణయాలకు పూనుకున్నది. లైవ్ స్ట్రీమింగ్ సేవల వినియోగంపై నిబంధనలను కఠినతరం చేసింది. న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్ నరమేధం ఘటనతో మా లైవ్ స్ట్రీమింగ్ విధివిధానాలను పునఃపరిశీలించాం. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉండే వీడియోలను ఎవరైనా ప్రసారం చేస్తే, లైవ్ స్ట్రీమింగ్ వినియోగించకుండా నిషేధం విధిస్తాం. ఉగ్రవాద సందేశాలను షేర్ చేసిన వారికి కూడా ఇది వర్తిస్తుంది అని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ గాయ్ రోజెన్ బుధవారం తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ పారిస్ వేదికగా క్రైస్ట్‌చర్చ్ కాల్‌కు పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పురిగొల్పే వీడియోల విస్తృతిని అడ్డుకోవడమే క్రైస్ట్ చర్చ్ కాల్ ఉద్దేశం.

Untitled Document
Advertisements